Your UPSC Exam 2025 Calendar: యూపీఎస్సీ పరీక్షల తేదీలు మళ్లీ మళ్లీ మారుచుండున్.. కొత్త ఎగ్జామ్స్ క్యాలెండర్ ఇదే...
యూపీఎస్సీ పరీక్షల తేదీలో మళ్లీ మారాయి. ప్రతీయేట నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షలకు సంబంధించిన యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ ను సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తూ ఉంటుంది. అలాగే 2025 సంవత్సరానికి గతంలో రెండు సార్లు పరీక్షల క్యాలెండర్ విడుదల చేయగా.. తాజాగా పరీక్షల తేదీలు మారుస్తూ మరో మారుకొత్త క్యాలెండర్ ను విడుదల చేసింది.. న్యూఢిల్లీ, నవంబర్ 10: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతీయేట అఖిల భారత సర్వీసు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2025-26 సంవత్సరానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాఖల్లో పలు ఉద్యోగాలకు నియామక పరీక్షల తేదీలు ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తేదీలను మార్చుతూ 2025లో నిర్వహించే వార్షిక పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షల తేదీలను మార్చిన యూపీఎస్సీ.. మూడోసారి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్ (ప్రిలిమ్స్) ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 11వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. మే 25న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 22వ తేదీన మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ సెప్టెంబర్ 18న జారీ కానుంది. జూన్ 8న రాత పరీక్ష ఉంటుంది. యూపీఎస్సీ 2025లో నిర్వహించే రివైజ్డ్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్), ఐఎఫ్‌ఎస్(ప్రిలిమ్స్) ఎగ్జామ్ మే 25, 2025 జరుగుతుంది. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(1) ఏప్రిల్ 13, 2025న జరుగుతుంది. ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమ్స్) ఎగ్జామ్ జూన్ 8, 2025న జరుగుతుంది. కంబైన్డ్ జియో-సైంటిస్ట్(ప్రిలిమ్స్) ఫిబ్రవరి 09, 2025న జరుగుతుంది. సీఐఎస్‌ఎఫ్ ఏసీ(ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ పరీక్ష మార్చి 09, 2025న జరుగుతుంది. ఐఈఎస్/ ఐఎస్‌ఎస్ ఎగ్జామ్ జూన్ 20, 2025న జరుగుతుంది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ జులై 20, 2025న జరుగుతుంది. సీఏపీఎఫ్(ఏసీ) ఎగ్జామ్ ఆగస్టు 03, 2025న జరుగుతుంది. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్ ఎగ్జామ్(2) సెప్టెంబర్ 14, 2025న జరుగుతుంది. ఎస్‌వో/ స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ డిసెంబర్ 13, 2025 జరుగుతుంది.


My post content
Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827