మనాలిలో భారీ ట్రాఫిక్ జామ్.. భారీగా కురుస్తోన్న హిమపాతం.. ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం పర్వత ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు క్యూలు కడుతున్నారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలోని సోలాంగ్ నాలా నుంచి అటల్ టన్నెల్ వరకు వెయ్యికి పైగా వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఈ జామ్‌ను క్లియర్ చేయడానికి పోలీసు , పరిపాలన ఉన్నతాధికారులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మంచు వర్షం కురవడంతో పర్యాటకులు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2024వ సంవత్సరం చివరి నెల జరుగుతోంది. వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నేపధ్యంలో పర్యాటకులు క్రిస్మస్ వేడుకల కోసం.. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం చెప్పడానికి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంత ప్రదేశాలకు క్యూ కడుతున్నారు. ఈ నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి వెలుగులోకి వచ్చిన వీడియో చూపరులకు షాక్ కలిగిస్తుంది. మనాలిలోని సోలాంగ్ నాలా నుంచి అటల్ టన్నెల్ వరకు 1000కు పైగా వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. డీఎస్పీ మనాలి, ఎస్‌డీఎం మనాలి, ఎస్‌హెచ్‌ఓ మనాలి పోలీసు బృందం సంఘటనా స్థలంలోకి చేరుకొని ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. హిమాచల్‌లోని చాలా జిల్లాల్లో వాతావరణం చాలా దారుణంగా ఉందని అంటే ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. భారీ హిమపాతం, వర్షం కురుస్తుంది. చాలా చోట్ల మంచు కురుస్తోంది. సిమ్లా, మనాలిలో కూడా మంచు కురుస్తోంది. రోడ్డుపై తెల్లటి దుప్పటిని పరచినట్లు కనువిందు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పేర్కొన్న మంచును తొలగిస్తున్నారు.