USA: నౌ ఆర్‌ నెవర్‌… ఇప్పుడు పోకపోతే ఇక ఎప్పటికీ అమెరికా వెళ్లలేమా..

నౌ ఆర్‌ నెవర్‌. ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ అమెరికా రాలేరన్న వర్సిటీల మెయిల్స్‌ కలకలం రేపుతున్నాయి. ట్రంప్‌ అధికారం చేపట్టగానే ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో భారీ మార్పులు తప్పవనే అనుమానాలకు అమెరికన్‌ వర్సిటీల మెయిల్స్‌ మరింత ఆజ్యం పోస్తున్నాయి. ట్రంప్‌తో అట్లుండొచ్చని ఉన్నఫళంగా అమెరికా బాటపడుతున్నారు స్టూడెంట్స్‌. ఇదే అదనుగా టికెట్‌ ధరలను భారీగా పెంచేశాయి విమాన సంస్థలు. మాములుగా 70వేలు ఉండే టికెట్‌ ధరను ఏకంగా లక్షా 70 వేలకు పెంచేశారట, ద్వైపాక్షి సంబంధాలు.. పాలసీలు సరే ఎయిర్‌వేస్‌ గాలి దోపిడి పెద్ద చర్చగా రచ్చగా మారిందిప్పుడు . దోస్త్‌ మేరా దోస్త్‌ …ఈ స్నేహ బంధం మరింత బలపడబోతుందా? రికార్డు విక్టరీతో హిస్టరీ క్రియేట్‌చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌.. జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి తన టర్మ్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉండేలా ఇప్పటి నుంచే అడ్మినిష్ట్రేషన్‌పై ఫోకస్‌ పెట్టారాయన. మరి ఈసారి భారత్‌తో ట్రంప్‌ అవలంభిచబోయే విధానాలు ఎలా ఉండబోతున్నాయి? భారతీయులకు భరోసాగా నిలుస్తా.. గ్రీన్‌ కార్డు విషయంలో సహకరిస్తామన్న ట్రంప్‌.. ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటారా? వీసాల విషయంలో 2016 మాదిరిగా పాత ఫ్లేవర్‌ ప్రదర్శిస్తారా? యువత డాలర్‌ డ్రీమ్స్‌కు ఊతం ఇస్తారా? అనే చర్చ జరుగుతోన్న టైమ్‌లో ఓ కీలక ప్రకటన. తన కొత్త టీమ్‌లో మరో ఇండియన్‌ అమెరికన్‌కు ఛాన్స్‌ ఇచ్చారు ట్రంప్‌. FBI డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ను నియమించారు. అడ్వోకేట్‌గా సుదీర్ఘ అనుభవం వున్న కాష్‌ పటేల్‌ డెడికేషన్‌ను ప్రశంసించారు ట్రంప్‌. వర్సిటీ మెయిల్స్‌తో టెన్షన్‌ టెన్షన్‌ గ్రీన్‌ కార్డు విషయంలో ఇండియాకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తారనే ఆశలు చిగురించాయి. ఇలాంటి టైమ్‌లో అమెరికన్‌ వర్సిటీల సూచనలతో ఇండియా సహా విదేశీ విద్యార్దుల్లో ఆందోళన నెలకొంది. ప్రియమైన విద్యానీ విద్యార్ధుల్లారా, విదేశి ఉద్యోగుల్లారా.. ఎక్కడున్నా సరే త్వరగా అమెరికాకు వచ్చేయండి. మీ మీ స్థానాలను పదిలిం చేసుకోండి అని మెయిల్స్‌ పంపించాయి పలు వర్సిటీలు. అందుకు కారణం.. జనవరి 20న ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. విదేశీ విధానాలు, ఆర్ధికం, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశాలపై ఆయన సంతకం చేస్తారనే చర్చ నడుస్తోంది. అదే జరిగే విదేశీ విద్యార్ధులు ఇక అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేది సదరు వర్సిటీల అభిప్రాయం. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. 2017, 17లో అమెరికాలో పలు కోర్సుల్లో జాయినైన విద్యార్దులు ఇండియాకు వచ్చారు. సెకండ్‌ ఇయర్‌ కోసమని అమెరికా వెళ్తే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వాళ్లను వెనక్కి పంపారు. చదువు పేరట వచ్చి పార్టీ టైమ్‌ కొలువు చేస్తున్నారంటూ..బ్యాంక్‌ అకౌంట్లు చెక్‌ చేసి మరి స్టూడెంట్స్‌ను భారత్‌కు తిప్పి పంపారు ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీపై భిన్నాభిప్రాయాలు ట్రంప్‌ పవర్‌ పగ్గాలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో భారీగా మార్పులుంటాయని కొందరు..అలాంటిదేమి వుండదని మరికొందరు ఇలా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ హామీ ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్‌లో భరోసా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టేలోపు వెనక్కి రావాలని వర్సీటీలు మెయిల్స్‌తో మళ్లీ అలజడి మొదలైంది. ట్రంప్‌ పాత ఫ్లేవర్నే కంటిన్యూ చేస్తారా.. ఫేవరబుల్‌గా వ్యవహరిస్తారా? అనే డైలామా మొదలైంది. వర్సిటీల నుంచి మెయిల్స్‌ అందుకున్న విద్యార్ధులు ఉన్నఫళంగా అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాంతో అమెరికా టికెట్లు హాట్‌ కేకుల్లా మారాయి. ఇదే అదనుగా విమాన సంస్థలు టికెట్ల రేట్లను ఆమాంతం పెంచేశాయి. సాధారణంగా 60 వేలు నుంచి 70వేలు ఉంటే ఫెయిర్‌ కాస్తా ఇపపుడు లక్ష 70వేలకు పైగా పెంచేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనపై ట్రంప్‌ కన్నెర్ర పగ్గాలు చేపట్టక ముందే తన విజన్‌ ఏంటో చెప్పేస్తున్నారు ట్రంప్‌. బ్రిక్‌ దేశాల ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనపై ట్రంప్‌ కన్నెర్ర చేశారు.గత అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో.. ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనపై దృష్టి సారించాలన్నారు పుతిన్‌. అలా చేస్తే బ్రిక్‌ దేశాల దిగుమతులపై వంద శాతం పన్నువిధిస్తామని హెచ్చరించారు ట్రంప్‌. అమెరికా ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే.. ఎలాంటి కఠినమైన నిర్ణయాలకైనా వెనుకాడమని చెప్పకనే చెప్తున్నారు ట్రంప్‌. ఇమ్మిగ్రేషన్‌ విషయంలో అదే పంథా కొనసాగిస్తారా? అనే అనుమానాలకు వర్సిటీల మెయిల్‌ సందేశం మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇమ్మిగ్రేషన్‌ విషయంలో ట్రంప్‌ సర్కార్‌ పాలసీ ఎలా వుండబోతుందనే చర్చ ఎలా వున్నా.. వర్సిటీల మెయిల్స్‌తో విమానా ఛార్జీలు ఆకాశన్నంటుతున్నాయి.