Unstoppable Season 4: ‘ప్రభాస్ ఆరడుగుల బంగారం’.. బాలయ్య షోలో డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. ఇప్పటికే ఎంతో మంది సినీ , రాజకీయ ప్రముఖులు ఈ సెలబ్రిటీ టాక్ షోలో సందడి చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలయ్య షోలో సందడి చేశారు. అతను ఈ షోకు రావడం ఇది రెండోసారి. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో రన్ అవుతన్నషో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అతనితో పాటు తల్లి నిర్మలమ్మ కూడా ఈ టాక్ షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఫైరింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రభాస్‌ గురించి బన్నీ మాట్లాడిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అందులో బాలయ్య ప్రభాస్ ఫొటోను చూపించగా బన్నీ ఇలా చెప్పుకొచ్చాడు ‘ ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని’ ఆకాశానికెత్తేశాడు. ఈ ప్రోమోను చూసిన బన్నీ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో ప్రభాస్ గురించి చెబుతూ ఆకాశానికెత్తాడు బన్నీ. ‘ప్రభాస్ నా ఫేవరెట్ హీరో మాత్రమే కాదు. ఫేవరెట్ పర్సన్ కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని’ ఓ సినిమా ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ అద్భుతమైన నటుడని.. తెలుగు సినిమా ఖ్యాతి పెంచాడని మరో సందర్భంలో మెచ్చుకున్నాడు బన్నీ. ఇప్పుడు ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్‌ షోలోనూ రిపీట్‌ చేశాడు అల్లు అర్జున్. దీంతో ప్రభాస్, బన్ని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.