Tollywood: స్టార్ విలన్ కూతురు పాన్ ఇండియా సెన్సేషన్.. డేటింగ్ రూమర్స్‏తోనే క్రేజ్.. 38 ఏళ్ల వయసులోనూ..

తండ్రి స్టార్ విలన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తండ్రి బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్.. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రముఖ విలన్ కూతురు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తండ్రి పవర్ ఫుల్ విలన్ అయినప్పటికీ కూతురు మాత్రం సినీరంగంలో లేడీ సూపర్ స్టార్. తన తండ్రి సహాయం లేకుండానే సొంత ప్రతిభతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సున్నితమైన స్వభావం.. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. 38 ఏళ్ల వయసులోనూ పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె ఎప్పుడు వ్యక్తిగత విషయాలు, డేటింగ్ రూమర్స్ తోనే వార్తలలో నిలుస్తుంది. ఈ స్టార్ విలన్ సూపర్ స్టార్ కూతురు మరెవరో కాదు శ్రద్ధా కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలను అందిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మధురమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాలను ఏలుతోంది. శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా, తన సొంత కృషి ద్వారా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. శ్రద్ధా కపూర్ 2010 లో “తీన్ పట్టి” చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే 2013లో విడుదలైన “ఆషికి 2” చిత్రం ఆమెకు నిజమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె “ఏక్ విలన్,” “ABCD 2,” “బాఘి” , “స్త్రీ” వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా శ్రద్ధా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. 38 ఏళ్ల శ్రద్ధా కపూర్ వివాహం గురించి చాలా రూమర్స్ వచ్చాయి. . నటుడు ఆదిత్య రాయ్ కపూర్ నుండి ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ , ఇప్పుడు స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీ వరకు ఆమె ప్రేమ, బ్రేకప్స్ అంటూ ప్రచారాలు నడిచాయి. శ్రద్ధా ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె “స్త్రీ 2” కొన్ని పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులలో కనిపిస్తుంది. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రద్ధా కపూర్ వివాహం కోసం అభిమానులు ఇంకా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది.