Tollywood: సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ.. గురువారం ఏం జరగనుంది.. ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. గురువారం (డిసెంబర్ 26న) ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సమావేశంకానున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజ్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్నారు. డిసెంబర్ 26న ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, దర్శకనిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజ్ తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత దిల్ రాజ్, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలవనున్నట్లు ప్రకటించారు దిల్ రాజ్. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంవో నుంచి సైతం అనుమతి లభించిందని అన్నారు. ఇప్పటికే బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.1 కోటి.. డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు.. పుష్ప నిర్మాతలు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు.. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహతోపాటు మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, సినిమా పరిశ్రమ సమస్యలు, ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇండస్ట్రీలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం దిల్ రాజు, అల్లు అరవింద్.. శ్రీతేజ్ ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తొందరగా కోలుకుంటున్నాడని.. 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇండస్ట్రీలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం దిల్ రాజు, అల్లు అరవింద్.. శ్రీతేజ్ ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తొందరగా కోలుకుంటున్నాడని.. 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827