Tibet Earthquake: టిబెట్‌లో భూకంప విధ్వంసం.. 95 మంది మృతి..130 మందికి గాయాలు

మంగళవారం ఉదయం బలమైన భూకంపం మొత్తం ఐదు దేశాలను వణికించింది. టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్ దేశాల్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం టిబెట్, నేపాల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలను ప్రభావితం చేసింది. భూకంపం కారణంగా టిబెట్‌లో చాలా మంది మరణించారు. భారత్‌లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. టిబెట్‌లో పెను విధ్వంసం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. టిబెట్‌లోని అనేక కుటుంబాలకు భూకంపం మరపురాని బాధను ఇచ్చింది మంగళవారం టిబెట్, నేపాల్‌లో భూకంప ప్రకంపనలతో సూర్యోదయం అయింది. అంతేకాదు భారతదేశం, బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంపం కేంద్రం టిబెట్. అక్కడ 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో ఇప్పటివరకు 95 మంది మరణించారని, 130 మంది గాయపడినట్లు తెలుస్తోంది. టిబెట్‌లోని షిగాజ్ నగరంలో భూకంపం సంభవించింది. షిగాజ్ నగరంలోని డింగ్రీ కౌంటీలో భూకంపం సంభవించింది. అయితే చైనా భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. USGS నివేదిక ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో ఒక గంటలోపు కనీసం ఆరు సార్లు నాలుగు నుంచి ఐదు తీవ్రతల భూకంపాలు నమోదయ్యాయి.