Telangana: చర్చకు సిద్ధం.. ఈ కేసులో అసలు పసలేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana: ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. అరెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్.. అయితే, కేటీఆర్.. ఫార్ములా-E రేస్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతూ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీని తలపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా-ఈ రేస్ కేసు రచ్చ రేపుతోంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇవాళ మరో బిగ్‌డే. ఉదయం నుంచి వరసబెట్టి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. అరెస్టును నిలుపుదల చేయాలన్న కేటీఆర్ అప్పీల్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ క్రమంలో కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ సుప్రీం కోర్టులో కేసు కొట్టివేతపై పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. నాపై అక్రమ కేసు పెట్టారని, ఇది రాజకీయ ప్రేరేపిత లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అసలు పసలేదని హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమేకొట్టేసింది.. అవినీతిపరులకు అంతా అవినీతే కనిపిస్తుందని ఆరపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమకేసు పెట్టారని, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని అన్నారు. బురద చల్లితే ఊరుకునే ప్రసక్తే లేదని, ఫార్ములా-ఈ రేస్‌లో రూపాయి అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు. నేనెలాంటి తప్పూ చేయలేదని, నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో చర్చకు సిద్ధమని, ఏసీబీ, ఈడీ విచారణకు కూడా హాజరవుతా కేటీఆర్ అన్నారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827