Team India: హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు! నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ తన భార్యతో విడిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత ఒకరు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ వెంటనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన ప్రకటన చేశాడు. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే టీ20 ప్రపంచకప్ అయిన తమ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు హార్దిక్- నటాషా. ఇప్పుడు టీమిండియాకు చెందిన మరో స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమైన చాహల్ వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. తన భార్య ధన్‌శ్రీ వర్మతో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. యుజువేంద్ర-ధన్‌శ్రీల వివాహం జరిగి డిసెంబర్ 22 నాటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ కనీసం వెడ్డింగ్ యానివర్సరీ పోస్టులు కానీ విషెస్ కానీ చెప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇదే కాదు గత కొన్ని రోజులుగా చాహల్- ధనశ్రీ సోషల్ మీడియా పోస్టులు వీరి విడాకుల వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2020లో కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించారు. అదే సమయంలో స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి పరిచయమయ్యాడు. ఇద్దరూ ముచ్చటపడి 2020 డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా అన్యోన్యంగా జీవించారు. పెళ్లి రోజు, పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ ఏడాది ధన్‌శ్రీ కానీ, చాహల్ కానీ అలాంటివేమీ చేయలేదు. డిసెంబర్ 22, 2024 వారి నాల్గవ వివాహ వార్షికోత్సవం. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ పోస్ట్ చేయలేదు.