Rain Alert: వామ్మో.. దూసుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచి ఉందా?.. అంటే అవుననే చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.. తాజా వెదర్ అప్‌డేట్స్‌పై వాతావరణ శాఖ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్నాళ్లుగా వరుసగా తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఏపీలో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. 23న అల్పపీడనం ఏర్పడి.. 27 నాటికి తుఫాన్‌గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28లోపు చెన్నై, నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాన్ ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక.. గత వారం కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి భారీ వర్షంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అంతకుముందు.. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్.. పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. రైతుల్లో అలజడి.. తాజా తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో అలజడి రేగుతోంది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ సమయంలో తుఫాన్ వస్తే.. తమకు పంట నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. పంట చేతికి అందివచ్చే సమయంలో తుఫాన్ ముప్పు వెంటాడుతుండడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణపై చలి పగబట్టింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లో చలి తీవ్రత పెరిగింది. నగరశివారులో గత రెండు, మూడు రోజుల నుంచి కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827