Pushpa 2: పుష్ప 2లో టీమిండియా స్టార్ క్రికెటర్.. తెరపై ఆ పాత్ర చూస్తే షాకే.. ఎవరో తెలుసా?

Krunal Pandya: పుష్ప 2లో విలన్‌గా నటించిన తారక్ పొన్నప్ప ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. ఇందుకు అసలు కారణం అతని లుక్. సినిమాలో చూపించిన అతని లుక్ హార్దిక్ పాండ్యా అన్నయ్య క్రికెటర్ కృనాల్ పాండ్యా లుక్‌తో సరిపోయింది. అందుకే సినిమాతో పాటు సోషల్ మీడియాలో వీరి చర్చలు జోరుగా సాగుతున్నాయి. Tarak Ponnappa – Krunal Pandya: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలి వారంలోనే కోట్లు వసూళ్లు చేస్తూ.. రూ. 1000 కోట్లు దిశగా సాగుతోంది. కానీ, ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అభిమానులు తప్పుగా భావించిన ఈ సినిమాలోని విలన్‌తో ఈ రచ్చ మొదలైంది. ఈ సినిమాలో విలన్ పేరు, అతని లుక్ గందరగోళానికి దారితీసింది. ఫ్యాన్స్ మాత్రం అతన్ని కృనాల్ పాండ్యాగా భావిస్తున్నారు. ఇలాంటి పోరపాటుకు కారణమైన వ్యక్తి పేరు తారక్ పొన్నప్ప. ఈయన అచ్చం కృనాల్ పాండ్యాలా కనిపిస్తున్నాడు.