Pushpa 2: శ్రీలీలా మజాకా.. పుష్ప స్పెషల్ సాంగ్ కోసం ఎంత తీసుకుంటుందో తెలుసా.?
పుష్ప2 సినిమా చిత్రీకరణ దాదాపు చివరి స్టేజ్‌కి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీలీలా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ పాట కోసం శ్రీలీల భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం ఈ పాట కోసం శ్రీలీల ఏకంగా... పుష్ప2 ఫీవర్ అప్పుడే మొదలైంది. విడుదలకు ఇంకా 25 రోజుల ఉండగా ఈ సినిమాకు సంబంధించి బజ్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ ఫస్ట్ పార్ట్ భారీ విజయం అందుకోవడం సీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఏ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి పార్ట్‌లో స్పెషల్ సాంగ్‌కు ఎలాంటి ఆదరణ లభించే అందరికీ తెలిసిందే. సమంత నటించిన ఈ పాట దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. అయితే ఇప్పుడు పార్ట్2లోనూ ఇలాంటి సాంగ్‌నే ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. పుష్ప2 స్పెషల్ సాంగ్‌లో ఎవరు నటించనున్నారన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించగా ఫైనల్‌గా శ్రీలీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభంకాగా మేకింగ్ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ కూడా అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం కొందరు నటీమణులు రూ. 2 కోట్లు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడీ ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీలీల ఇంత మొత్తంలో తీసుకోవడం విశేషమమేనని చెప్పాలి. ఇక పుష్ప2లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ కిస్సిక్ అనే లిరిక్స్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లేనని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఇది పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. ఇక ఈసారి ప్రమోషన్స్‌ను కూడా ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్స్‌ను దేశంలోని అన్ని నగరాల్లో ప్లాన్ చేస్తున్నారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827