PM Modi: గ్లోబల్ లీడర్స్‌లో మోదీ ఛాంపియన్.. భారత ప్రధానిపై గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ ప్రశంసలు..

ప్రధాని మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నైజీరియా, బ్రెజిల్‌ దేశాల్లో కార్యక్రమాలకు హాజరైన మోదీ.. ఇప్పుడు మరో దేశంలో అడుగుపెట్టారు. బుధవారం గయానాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానా వెళ్లారు ప్రధాని మోదీ.. 56ఏళ్ల తర్వాత గయానా వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీకి.. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నైజీరియా, బ్రెజిల్‌ దేశాల్లో కార్యక్రమాలకు హాజరైన మోదీ.. ఇప్పుడు మరో దేశంలో అడుగుపెట్టారు. బుధవారం గయానాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానా వెళ్లారు ప్రధాని మోదీ.. 56ఏళ్ల తర్వాత గయానా వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీకి.. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్‌-గయానా మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్‌లు, వ్యవసాయం, మెడిసిన్స్‌, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, రక్షణరంగానికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. ప్రధాని మోదీని గ్లోబల్ లీడర్స్‌లో ఛాంపియన్ అంటూ కొనియాడారు..