Pakistan: పాకిస్తాన్‌లో మొదటి హిందూ పోలీసు ఆఫీసర్.. మైనార్టీ సమస్యలు తీర్చేందుకు ప్రత్నిస్తా అంటున్న రాజేంద్ర

భారత దేశం మత ప్రాతిపదికిన భారత్, పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. దీంతో భారత దేశం లౌకిక వాదాన్ని ఎంచుకుంది.. పాకిస్తాన్ ముస్లిం దేశంగా మారింది. దీంతో దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉన్న భారతీయుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోయింది. ఆ దేశంలోని మైనారిటీలుగా హిందువులు నివసిస్తున్నారు. అయితే దేశం ఏర్పడిన తర్వాత రాజేంద్ర మేఘ్వార్ పాకిస్థాన్ చరిత్రలో మొదటి సారిగా ఓ హిందూ యువకుడు పోలీసు అధికారి అయ్యాడు. పాకిస్తాన్ దేశంలో ఓ హిందూ యువకుడు పోలీసు అధికారి అయ్యాడు. రాజేంద్ర మేఘ్వార్ అనే యువకుడు పాకిస్థాన్ పోలీస్ సర్వీస్ (PSP)లో చేరిన మొదటి హిందూ అధికారి. ఫైసలాబాద్‌లో విధులు నిర్వహించడం ప్రారంభించారు. గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా విధులను నిర్వహించనున్నారు మేఘ్వార్ అనే యువకుడు. ఇతను సింధ్‌లోని పేద ప్రాంతమైన బాడిన్ నివాసి. CSS పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత రాజేంద్ర మేఘ్వార్ పోలీసు దళంలో చేరాడు. పోలీసు శాఖలో అధికారిగా నియమితులైన సందర్భంగా ఏఎస్పీ రాజేంద్ర మేఘ్వార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీసు శాఖలో తన సామాజికవర్గ ప్రజలకు చేయాల్సిన పనిని ఇతర శాఖల్లో చేయలేనని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తా.. పోలీసు శాఖలో ఉంటే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను పరిష్కరించగలమని.. ఇలా వేరే ఇతర శాఖల్లో చేయలేమని మేఘవార్ అన్నారు. మరోవైపు తొలిసారిగా ఫైసలాబాద్‌లో హిందూ యువకుడు ఏఎస్పీగా నియమితుడయ్యాడని ఇది చాలా సంతోషకరమైన సమయం అని పోలీసు అధికారులు చెప్పారు. మా దగ్గర ఒక హిందూ అధికారి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి రాజేంద్ర మేఘ్వార్ సహకరిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. మనకు ఒక హిందూ అధికారి ఉండటం మన అదృష్టం. అతను పోలీసు శాఖలో చేరడం ఫైసలాబాద్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పోలీసులలో మరింత మంది చేరవచ్చు అనే భావనను ప్రోత్సహిస్తుందని చెప్పారు. అంతేకాదు రహీమ్ యార్ ఖాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీకి చెందిన రూపమతి అనే మహిళ కూడా CSS పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌ ఇమేజ్‌ను తెలియజేస్తానని రూపమతి వెల్లడించింది.