PAK vs NZ: సెంచరీలతో చెలరేగిన విల్ యంగ్, టామ్ లాథమ్.. పాక్ ముందు భారీ టార్గెట్..

Pakistan vs New Zealand, 1st Match, Group A: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు 321 పరుగుల భారీ టార్గెట్ అందించింది. విల్ యంగ్ 107 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, టామ్ లాథమ్ అజేయంగా 118 పరుగులతో నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులతో పాక్ బౌలర్ల నడ్డి విరిచారు. Pakistan vs New Zealand, 1st Match, Group A: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆతిథ్య పాకిస్థాన్‌కు 321 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున విల్ యంగ్ 107 పరుగులు, టామ్ లాథమ్ అజేయంగా 118 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులు సాధించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అబ్రార్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. రెండు జట్ల ప్లేయింగ్-11.. పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్కే.