News9 Global Summit: ప్రతీ దేశం భారత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది: ప్రధాని మోదీ

టీవీ నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్‌9 జర్మీలో గ్లోబల్‌ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరుగుతోన్న ఈ కార్యక్రమంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అంశాలపై స్పందించారు. భారత్‌, జర్మనీ దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారత్‌ కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరిగిన TV9 నెట్‌వర్క్ News9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు (శుక్రవారం) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఇండో-జర్మన్ బంధం పెంపొందిందని, యూరోపియన్ ప్రాంతంలో భారత్‌ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రశంసించారు. భౌగోళిక-రాజకీయంగా, యూరప్ భారతదేశానికి ఒక ముఖ్యమైన ప్రాంతం అని, జర్మనీ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములల్లో ఒకటని తెలిపారు. 2024లో ఇండో-జర్మనీ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపిన మోదీ.. వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ఈ సంవత్సరం చారిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత ప్రయాణంలో జర్మనీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని, మరిన్ని జర్మనీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించామని చెప్పుకొచ్చారు. ఇక ఇండో-జర్మన్ వాణిజ్యం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరగబోతున్నాయి. ఇండో-జర్మన్ ఆర్థిక నిబంధనలు మరింత బలపడ్డాయి. నేడు, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోని ప్రతీ దేశం అభివృద్ధి కోసం భారత్‌తో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది. జర్మన్ ‘ఫోకస్ ఆన్ ఇండియా డెవలప్‌మెంట్’ దీనికి నిదర్శనం” అని మోదీ చెప్పొచ్చారు.