New Orleans attack: న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ…
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో జనంపైకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి. అమెరికా పౌరుడే అయిన షంషుద్దీన్ జబ్బార్(42) దీనికి కారకుడని పోలీసు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఘటన అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోయాడు. కాగా ఈ ఉగ్రదాడిని తాజాగా భారత ప్రధాని మోదీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్‌లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఖండించారు . “న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు.. బాధితులు.. వారి కుటుంబాలతో ఉన్నాయి. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు కావాల్సిన మనోధైర్యం, బలం వారికి లభించాలి” అని మోదీ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం వేళ అమెరికాలో జరిగిన దారుణ ఘటన ఇది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న జనంపైకి దూసుకెళ్లిన ఓ కారు దారుణ మారణహోమానికి కారణమైంది. ఘటనలో 15 మంది చనిపోయారు. 30 మంది గాయపడ్డారు. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ కెనాల్, బోర్బన్ స్ట్రీట్‌లో జరిగిందీ దారుణం. ఓ వ్యక్తి కావాలనే న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న ప్రజల మీదకు కారును వేగంగా తీసుకెళ్లాడు. తర్వాత కారు దిగి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు.. ఇది తీవ్రవాద ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో పేలుడు పదార్థాలు లభించాయి. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని FBI తెలిపింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు తెలిపింది న్యూ ఓర్లాన్స్ దాడి వెనక ఐసిస్ హస్తం ఉందా? FBI సేకరించిన ఆధారాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుండుగుడి వాహనంలో ఐసిస్ జెండాలతోపాటు పేలుడు పదార్థాలు ఉన్నట్లు FBI తెలిపిందని బైడెన్ చెప్పారు. తాను ఐసిస్‌తో స్ఫూర్తి పొందినట్లు దాడికి ముందు సోషల్ మీడియాలో దుండుగుడు పోస్ట్ పెట్టాడు. గతంలో అమెరికా ఆర్మీలో పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అక్కడ ప్రభుత్వ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. నిందితుడు ఐసిస్ లోన్ ఉల్ఫ్‌గా చెబుతున్నారు. ఓ ఉగ్రవాద సంస్థ ద్వారా ప్రభావితం చెంది చిన్న గ్రూపులుగా లేదా ఒంటరిగా దాడి చేసే వారిని లోన్ ఉల్ఫ్‌గా పిలుస్తుంటారు. ఘటన అనంతరం పోలీసుల కాల్పుల్లో షంషుద్దీన్ చనిపోయాడు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827