ఆదాని ని అరెస్ట్ చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు - నీరుగట్టు నగేష్

ఆమ్ ఆద్మీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ని 26th November 2024 విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవము రోజున కావడం మనందరికీ తెలిసిందే. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను రాజకీయ పార్టీలను అవినీతి సొమ్ముతో నియంత్రిస్తున్న అదానీ నిని అరెస్టు చేయాలి అని చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మహాత్మా గాంధీ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియాత్ర చేయడం జరిగింది ఈ శాంతి యాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సీరా రమేష్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ వెంకటాచలం జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఖమ్మం పార్టీ కృష్ణ మిగతా జిల్లా కన్వీనర్లు పార్టీ సభ్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది శాంతి యాత్రలో చేసిన నినాదాలు 1. ఈ రాష్ట్రానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అమెరికా అవినీతి కేసులో ప్రథమ ముద్దాయి గౌతం అదానీ ని రెండో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలి 2. అమెరికా అవినీతి కేసులో కేంద్ర అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు అని ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద ముఖ్యంగా దేశ ప్రధాని మోడీని విచారించాలి 3. అదానీ మీద ఆరోపణలు రాగానే కెన్యా ప్రభుత్వం అదానీ తాలూకా అన్ని కాంట్రాక్ట్లను రద్దు చేస్తే మన ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేయబోతుంది అని నినాదాలు చేయడం జరిగింది 4. అవినీతి అదానీ కి ఇచ్చిన గంగవరం అలాగే కృష్ణపట్నం పోర్టులను ఎప్పుడు వెనుక తీసుకుంటున్నారు అని నినాదాలు చేయడం జరిగింది 5. అదానీ కేసులో ప్రధాన ముద్దాయి అదానీ మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటూ నాటకాలు ఆడుతున్నారా అని నినాదాలు చేయడం జరిగింది 6.SEBI కి ఇవ్వాల్సిన నివేదికలలో అమెరికా అవినీతి కేసుని దాచిపెట్టిన అదాని కంపెనీ మీద SEBI విచారణ ఎప్పుడు చేయబోతున్నారు అని నినాదాలు చేయడం జరిగింది 7. అదానీ మీద Hinden బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలను CBI,ED,SEBI లు విచారణ ఎప్పుడు చేయబోతున్నాయి అని నినాదాలు చేయడం జరిగింది 8. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న అదానీ అరాచకాలనుంచి విముక్తి ఎప్పుడూ అని నినాదాలు చేయడం జరిగింది 9. ఈ రాష్ట్రంలో అదానీ ని అరెస్టు చేయమని ప్రశ్నించే దమ్ము రెండు పార్టీలకు ఉందా అని నినాదాలు చేయడం జరిగింది 10. ఈ దేశంలో అదానీ నీ ఎదుర్కోగలిగిన సత్తా ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది అని నినాదాలు చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ శీరా రమేష్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో అవినీతి లేకపోతేనే అభివృద్ధి చెందుతుంది అని పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ ఒక్కటే అదానీ మీద విచారణ చేయమని అడగగలిగే సత్తా ఉంది అని అలాంటి పార్టీని ప్రతి ఒక్క సామాన్యులు ఆదరించాలని కోరడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ అమెరికాలో అదాని మీద పెట్టిన కేసులో ప్రథమ ముద్దాయి గౌతం ఆదాని అయితే అదానీ మీద మాట్లాడకుండా కక్షపూరిత వాతావరణం సృష్టించి ఈ అవినీతి కేసు నుంచి అదానీ తప్పించే కుట్ర జరుగుతుంది అని మాట్లాడడం జరిగింది అదానీ కి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని అలాకాకుండా కాలయాపన చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నాం అంటూ రాజకీయ ప్రకటనలు చేస్తే మీ పార్టీ కూడా అదానీ ఏజెంట్ గా భావించాల్సి వస్తుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఈ సందర్బంగా నీరుగట్టు నగేష్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ లొ అదానీ నీ అరెస్టు చేయమని ఒక్క పార్టీ మాట్లాడకపోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అదాని ఎంతలా శాశిస్తున్నాడో అర్థమవుతుంది అని మాట్లాడడం జరిగింది అదానీ ని అరెస్టు చేయాలి అని మాట్లాడగలిగిన సత్తా దమ్ము సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కె ఉంది అని మాట్లాడడం జరిగింది క్విట్ ఇండియా తరహాలో క్విట్ అదానీ అన్న నినాదం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చేయగలిగితేనే అదానీ అరాచకాలు నుంచి ఈ రాష్ట్రం బయటపడుతుంది అని రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.