Maheesh theekshana: భారత్ పర్యటన మాకు అవమానం.. బాంబ్ పేల్చిన మహేశ్ తీక్షణ
శ్రీలంక క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌పై 12 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. మహేశ్ తీక్షణ ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ, గత ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యాన్ని "అవమానం"గా పేర్కొన్నారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, జట్టు ప్రగతిపథంలో ఉందని, రాబోయే టోర్నమెంట్లలో గట్టి పోటీని ఇవ్వగలదని తీక్షణ విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీలంక క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, 12 ఏళ్ల విరామం తర్వాత వన్డే సిరీస్ గెలించింది. ఈ విజయంలో మహేశ్ తీక్షణ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పాటు గత వల్డ్ కప్ లో తమ జట్టు ఆటతీరుపై మహేశ్ తీక్షణ స్పందించాడు. ప్రపంచకప్‌లో శ్రీలంక ఓడిన తీరు తమకు అవమానంగా నిలిచిందన్నారు. ఆ టోర్నమెంట్‌లో జట్టు దారుణమైన ప్రదర్శన చేసిందని.. గుర్తు చేస్తూ, ప్రస్తుతం జట్టు గెలుపు మార్గంలో పయనిస్తోందని తెలిపారు. కుసాల్ మెండిస్‌తో కలిసి 43 పరుగుల భాగస్వామ్యంతో తీక్షణ 27 రన్స్ చేసి కీలక ప్రదర్శన చేశాడు. కీలక వికెట్లు తీసిన తీక్షణ అటు బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ నిలకడ రాణించాడు. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయం, గతంలో భారత్‌పై సాధించిన విజయం వంటి ఘనతలతో శ్రీలంక జట్టు పటిష్ఠంగా మారిందని తీక్షణ తెలిపారు. ప్రస్తుతం కోచ్ సనత్ జయసూర్య నేతృత్వంలో జట్టు ప్రగతిపథంలో ఉందని పేర్కొన్నారు. ఐసీసీ టోర్నమెంట్ల ప్రాధాన్యత శ్రీలంక తమ మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పని చేస్తోందని తీక్షణ తెలిపారు. గత ఐసీసీ ఈవెంట్లలో విజయాలు, పరాజయాల అనుభవాలను ఆధారంగా తీసుకుని, ఆటతీరును మెరుగుపరచడం అత్యవసరమని అభిప్రాయపడ్డాడు. కాగా మహేశ్ తీక్షణ వ్యాఖ్యలు శ్రీలంక క్రికెట్ సెగలు కక్కిస్తోంది. ఒకవైపు 2023 ప్రపంచకప్‌లో తలెత్తిన వైఫల్యాలు ఆత్మపరిశీలనకు దారితీస్తే, తాజా విజయాలు జట్టు పటిష్ఠతను స్పష్టంగా చూపిస్తున్నాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, మెరుగైన జట్టు సంస్కృతిని ఏర్పరచుకుంటున్న శ్రీలంక, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో మరింత పోటీనిచ్చే అవకాశం ఉంది. దీంతో శ్రీలంక ఒకప్పటిలా మారడానికి మరెన్నో రోజుల సమయం పట్టదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827