Maharastra: దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను.. మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథులుగా హాజరైయ్యారు. మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ కొలువు తీరింది. మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో కలర్‌ఫుల్‌గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ , కేంద్రమంత్రులు అమిత్‌షా , రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు హేమాహేమీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మహారాష్ట్రలో గత రెండు వారాలుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ప్రమాణం చేయించారు. మహాయుతి నేతలను ప్రధాని మోదీ అభినందించారు. ఫడ్నవీస్ కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే , అజిత్‌పవార్ ప్రమాణం చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్తలు , బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్స్ షారూఖ్‌ఖాన్ , సల్మాన్‌ఖాన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రణబీర్‌కపూర్, సంజయ్‌దత్ కూడా పాల్గొన్నారు. మహాయుతి కూటమి ఐక్యతను సూచిస్తూ ఫడ్నవీస్ , షిండే , అజిత్‌పవార్ ఒకేసారి వేదిక మీదకు విచ్చేశారు. దాదాపు 50 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాల్లో 230 స్థానాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. ఏక్‌నాథ్‌షిండే డిప్యూటీ సీఎం పదవిని చేపడుతారా ? లేదా ? అన్న విషయంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తరువాత షిండే ప్రధాని మోదీ ఆశీర్వాదాలు తీసుకున్నారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827