Mahakumbha Mela 2025: మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలను సందర్శించడం మరచిపోవద్దు.. 12 సంవత్సరాలకు
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్ రెడీ అవుతోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సమయంలో గంగా నదిలో స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటారు. 2025 లో జరగనున్న మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు మీరు కూడా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, అక్కడ త్రివేణీ సంగమమే కాదు అనేక ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రయాగ్‌రాజ్ హిందూ మతం ప్రజల విశ్వాసానికి కేంద్రంగా బాసిల్లుతుంది. ఎందుకంటే త్రివేణి సంగమం ప్రదేశం.. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం. 2013 తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్లీ 13 జనవరి 2025న పుష్యమాసం పూర్ణిమ రోజున మహాకుంభం ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద హిందు మత సమావేశంగా పరిగణించబడుతుంది. ఈ మహా కుంభమేళా సమయంలో భక్తులు దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తారు.ఇక్కడ ఆధ్యాత్మికతతో భారతీయ సంస్కృతి అద్భుతమైన సంగమం చూడవచ్చు. ఈసారి కూడా మహాకుంభ మేళాకి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మీరు కూడా మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కి వెళుతున్నట్లయితే.. త్రివేణి సంగమంలో స్నానం చేయడంతోపాటు ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో తెలుసుకుందాం.. 2025 మహాకుంభ మేళాకి ప్రయాగ్‌రాజ్‌కి వెళుతున్నట్లయితే ఈ ప్రదేశం ఆధ్యాత్మిక దృక్కోణంలో మాత్రమే కాదు అనేక సందర్శన ప్రదేశాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిని అన్వేషించడం మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కనుక ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకి వెళ్తే.. మీరు ఏ ప్రదేశాలను అన్వేషించవచ్చంటే.. బడే హనుమంజీ దేవాలయం గంగా-యమునా ఒడ్డున నిర్మించబడిన బడే హనుమంతుని ఆలయం ఉంది. దీని కీర్తి విశ్వా వాప్తం. ఇక్కడ హనుమంతుడు శయన భంగిమలో దర్శనం ఇస్తాడు, త్రివేణీ సంగమంలో స్నానం చేసిన తర్వాత తప్పక ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. అంతేకాదు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకుంటే మంకమేశ్వర్ ఆలయం, నాగవాసుకి ఆలయం (దరగంజ్), హనుమత్ నికేతన్ ఆలయం (సివిల్ లైన్), సజవాన మహాదేవ ఆలయానికి వెళ్లవచ్చు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827