KCR Movie: కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత.. కష్టానికి దక్కిన ఫలితం అంటున్న నెటిజన్స్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా రాకేష్.. రీసెంట్ గా కేసీఆర్ ( కేశవా చంద్ర రామావత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రాకేష్. చిన్న చిన్న స్టేజ్ షోల దగ్గర నుంచి ఇప్పుడు ఓ సినిమాకు నిర్మాతగా నటుడిగా మారి ఎంతో మందికి స్పూర్తి‌గా నిలిచాడు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా రాకేష్.. రీసెంట్ గా కేసీఆర్ ( కేశవా చంద్ర రామావత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకట్టుకునే కథనం, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన కేసీఆర్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నటుడిగా రాకేష్ ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే నిర్మాతగానూ తన సినిమాను కాపాడుకున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.