Kanguva OTT: ఓటీటీలోకి సూర్య కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. సూర్య ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశాడు సూర్య. అలాగే ఇప్పుడు కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. కంగువ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటేసింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. దాంతో ఇప్పుడు సౌండ్ లెవెల్‌ను 2 పాయింట్లు తగ్గించి సినిమాను నడపాలని నిర్మాత జ్ఞానవేల్ థియేటర్ యజమానులను కోరారు.