Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట.. గాయంపై కీలక అప్‌డేట్

Jasprit Bumrah Injury: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో చిత్తుగా ఓడిన భారత జట్టు.. త్వరలో ఇంగ్లండ్ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సిరీస్‌లో 32 వికెట్లతో భారత స్టాండ్ అవుట్ ప్లేయర్‌గా నిలిచిన బుమ్రా, వెన్నునొప్పితో బాధపడుతూ ఐదో టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. Jasprit Bumrah Injury: వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగబోయే వైట్-బాల్ సిరీస్‌ నుంచి బుమ్రాను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకోనిచ్చేందుకు బీసీసీఐ ఆలోచిస్తోందంట. కేవలం బోర్డర్-గవాస్కర్‌ ట్రోపీలో ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో భారత జట్టు ఓడిపోయింది. అయితే, ఇందులో బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 5వ టెస్ట్ మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. 30 ఏళ్ల బుమ్రా ఈ సిరీస్‌లో 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. గాయం ఈ సిరీస్‌లో అతని అధిక పనిభారానికి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే బుమ్రా తప్పక ఉండాల్సిందే. ఇందుకోసమే BCCI వైద్య బృందం ప్రయత్నిస్తుంది. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం మేరకు, బుమ్రా వెన్నునొప్పి తీవ్రతపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భారత్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారాన్ని ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. బుమ్రా గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, రిటర్న్ టు ప్లే (RTP)కి ముందు కనీసం రెండు నుంచి మూడు వారాల పునరావాసం పడుతుంది. గ్రేడ్ 2 గాయం విషయంలో, రికవరీ ఆరు వారాల వరకు ఉంటుంది. అయితే గ్రేడ్ 3 ఉంటే కష్టమవుతోంది. కనీసం మూడు నెలల విశ్రాంతి, పునరావాసం అవసరం అవుతోంది.