ISRO: ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్.. కారణం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..

ఎలెన్ మస్క్.. స్పేస్ ఎక్స్.. ప్రపంచవ్యాప్తంగా తరచూ వినపడుతున్న పేర్లు.. అంతరిక్ష ప్రయోగాల్లో నాసా తర్వాత వినూత్నమైన ప్రయోగాల్లో దూసుకుపోతున్న సంస్థ స్పేస్ ఎక్స్. ఎలెన్ మస్క్.. స్పేస్ ఎక్స్.. ప్రపంచవ్యాప్తంగా తరచూ వినపడుతున్న పేర్లు.. అంతరిక్ష ప్రయోగాల్లో నాసా తర్వాత వినూత్నమైన ప్రయోగాల్లో దూసుకుపోతున్న సంస్థ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్‌ను ఎలెన్ మస్క్ స్థాపించారు. సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల కోసం ఉపయోగించే వాహక నౌకలు ఒకసారి ప్రయోగం జరిగితే ఆ తర్వాత మళ్లీ వినియోగించడం కుదరదు. అందుకోసం వందల కోట్లలో ఖర్చు వృధా అవుతూ ఉంటుంది. అయితే ఇలా మస్క్ ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాల చరిత్రను తిరగరాశారు. రీ యూసేబుల్ రాకెట్‌ను తయారు చేసి సక్సెస్ అయ్యారు. అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రయోగాలను స్పేస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఇక భారత్ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన ముద్ర సంపాదించుకుంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఇటీవల కాలంలో దేశీయ అవసరాలతో పాటు.. కమర్షియల్ పరంగానూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంది. ఇతర దేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి భారత సత్తాను ప్రపంచస్థాయిలో నిలిపింది.