IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా ఆ ప్లేయర్ బెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ సలహా..
IPL మెగా వేలం సమీపిస్తున్న కొద్దీ, RCB జట్టు కెప్టెన్సీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటీదార్‌ను నియమించాల్సిందిగా టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప సూచించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రజత్ పాటిదార్ మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 34.73 సగటుతో 799 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రజత్ పాటిదార్ 7 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై ఈ సెంచరీ సాధించాడు. ఇది కాకుండా, రజత్ పాటిదార్ టీమ్ ఇండియా తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు, 1 వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. టెస్టుల్లో, అతను 10.50 సగటుతో కేవలం 63 పరుగులు చేశాడు. వన్డేల్లో 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే అతను టీమ్ ఇండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ మెగా వేలానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలంలో అన్ని జట్లతో పోలిస్తే RCB వైపే అందరీ దృష్టి ఉంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెగా వేలంలో స్టార్ ప్లేయర్లు, కెప్టెన్ల కోసం వెతుకుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇందులో గత సీజన్ వరకు ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ పేరు లేదు. RCB జట్టు తదుపరి సీజన్‌లో కొత్త కెప్టెన్‌తో ఆడబోతున్నట్లు తెలుస్తుంది. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప RCB కెప్టెన్ గురించి పెద్ద ప్రకటన చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పాటిదార్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయాలని రాబిన్ ఉతప్ప సూచించాడు." రజత్ పాటిదార్‌ని ప్రధాన పాత్రలో చూడాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అవసరం. మీరు రజత్ పాటిదార్‌ను విశ్వసించవచ్చు" ఆయన పేర్కొన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లిని గరిష్టంగా రూ.21కోట్లకు, రజత్ పటీదార్‌ను రూ.11కోట్లకు, యశ్ దయాల్‌ను రూ.5కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం జట్టు వద్ద రూ. 83 కోట్లు ఉన్నాయి.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827