IPL 2025 Mega Auction: సామ్ కుర్రాన్ నుంచి ఫాఫ్ డు ప్లెసిస్ — అత్యంత చౌకగా లభించిన ఆరుగురు విదేశీ ఆటగాళ్ళు
IPL 2025 మెగా వేలంలో జట్లు వ్యూహాత్మకంగా ఖర్చు చేసి, కొన్ని అద్భుతమైన విదేశీ ఆటగాళ్లను చౌక ధరలకు దక్కించుకున్నాయి. సామ్ కుర్రాన్ CSKకు ₹2.4 కోట్లకు తిరిగి చేరగా, డేవిడ్ మిల్లర్ ₹7.5 కోట్లకు LSGలో చేరాడు. ఫాఫ్ డు ప్లెసిస్ ₹2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కి చేరడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ డి కాక్‌ను ₹3.6 కోట్లకు సొంతం చేసుకోవడం అతని స్థాయిలో ఒక గొప్ప డీల్‌గా నిలిచింది. ఓపెనింగ్‌లో అతని దూకుడైన ఆటతీరు, నిలకడైన ప్రదర్శనలు KKR బ్యాటింగ్ లైనప్‌లో ప్రధాన బలం అందిస్తాయి. “కిల్లర్ మిల్లర్” గాపేరుగాంచిన డేవిడ్ మిల్లర్‌ను LSG ₹7.5 కోట్లకు దక్కించుకుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో అతని డెత్ ఓవర్ల బ్యాటింగ్, మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యం జట్టుకు అమూల్యమైనదిగా మారింది. IPL 2025 మెగా వేలం భారీ ఆసక్తి మధ్య ముగిసింది. రెండు రోజుల వ్యూహాత్మక బిడ్డింగ్ తర్వాత, జట్లు మునుపెన్నడూ లేని విధంగా తమ స్క్వాడ్లను పునర్నిర్మించుకోవటానికి కృషి చేశాయి. ఈ సీజన్‌లో, కొన్ని భారీ ధరల సంతకాలతో పాటు, చవక ధరలకు చేసిన కీలక డీల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా, విదేశీ ఆటగాళ్ల ఎంపికలో జట్లు వ్యూహాత్మక మార్పు తీసుకువచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన డీల్స్ గురించి చర్చిద్దాం. సామ్ కరన్ గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కానీ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కేవలం ₹2.4 కోట్లకు సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కరన్ తన స్వింగ్ బౌలింగ్‌తో పాటు, లోయర్ ఆర్డర్‌లో పవర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యంతో జట్టుకు కీలక ఆస్తిగా నిలుస్తాడు. అతని చవక బిడ్ జట్టుకు వ్యూహాత్మక విజయంగా భావించవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టుకు మిచెల్ మార్ష్‌ను ₹3.4 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ తన దూకుడైన బ్యాటింగ్ తో పాటూ మీడియం పేస్ బౌలింగ్‌తో జట్టుకు బలంగా మారతాడు. అతని సీనియరిటీ జట్టులో నాయకత్వానికి తోడ్పాటును ఇస్తుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రామ్ కేవలం ₹2 కోట్లకు అమ్ముడవడం ఆశ్చర్యకరం. టాప్ ఆర్డర్ బ్యాటింగ్, ఆఫ్ స్పిన్ సామర్థ్యంతో పాటు విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఆడగలగడంతో అతన్ని వ్యూహాత్మకంగా తీసుకుంది లక్నో . ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ₹2 కోట్లకు సొంతం చేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఇన్నింగ్స్‌లను స్థిరంగా నడిపించడంలో, జట్టుకు అనుభవాన్ని అందించడంలో అతని పాత్ర కీలకమైనది. RCB అభిమానులు తమ మాజీ కెప్టెన్ కోసం బిడ్డింగ్ చేస్తారని ఆశించినప్పటికీ, ఢిల్లీ అతన్ని చవక బిడ్లో కైవసం చేసుకుంది. ఈ వేలం మరోసారి IPL జట్ల వ్యూహాత్మక తెలివితేటలను ప్రదర్శించింది. డీల్‌కి తగ్గ విలువ చెల్లిస్తే జట్టు విజయావకాశాలను పెంచడం ఖాయం.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827