Indian Economy: దశాబ్దంలోనే తారుమారైంది.. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది.. గతంతో పోలిస్తే.. దేశ ఆర్థిక వృద్ధిరేటు-జీడీపీ మరింత మెరుగుపడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో మరింత వృద్ధి సాధించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది.. గతంతో పోలిస్తే.. దేశ ఆర్థిక వృద్ధిరేటు-జీడీపీ మరింత మెరుగుపడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో మరింత వృద్ధి సాధించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. ఆర్థిక వృద్ధి కోసం భారతదేశంలో అన్ని రకాల పెట్టుబడులు 14 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి.. అయితే, ఇందులో $8 ట్రిలియన్ డాలర్లకు పైగా గత దశాబ్దంలోనే పెట్టుబడులు వచ్చినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకటించింది.. ఇప్పటివరకు మొత్తం పెట్టుబడులు 14 ట్రిలియన్ డాలర్లు అయితే.. సగానికిపైగా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినట్లు నివేదిక తెలిపింది.. ఈ కాలంలో ఆధునికీకరణను వేగవంతం చేయడం, పెట్టుబడుల మార్గదర్శకాలు సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుబ‌డులు పెరిగిటన్లు తెలిపింది. దేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి $ 14 ట్రిలియన్లను పెట్టుబడుల కోసం ఖర్చు చేసింది.. గత దశాబ్దంలో మాత్రమే $ 8 ట్రిలియన్లు ఖర్చు చేసింది” అని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది.