IND vs WI: దీప్తి, రేణుకల సూపర్ స్పెల్.. విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు మధ్య మూడో వన్డే మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 27) వడోదర వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ వడోదరలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా హేలీ మాథ్యూస్ సారథ్యంలోని జట్టును కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటర్లు తమ సత్తా చూపి ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలోనే ఛేదించారు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆమె నిర్ణయం తప్పని తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. భారత బౌలర్ల ధాటికి ఏ బ్యాటర్ కూడా నిలువలేకపోయారు. భారత్ తరఫున రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ కలిసి ప్రత్యర్థి జట్టును కకావికలు చేశారు. ఇన్నింగ్స్ తొలి బంతికే వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చింది రేణుక. చివరి బంతికి మరో వికెట్‌ తీసింది. ఆ తర్వాత 9 పరుగుల వద్ద మూడో వికెట్‌ కూడా పతన మైంది. దీంతో కరీబియన్ జట్టు ఇక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ మిగిలిన పనిని పూర్తి చేసింది. రేణుక 9.5 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా, దీప్తి 10 ఓవర్లలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. వీరిద్దరిసంచలన బౌలింగ్‌తో భారత జట్టు వెస్టిండీస్‌ను 162 పరుగులకే పరిమితం చేసింది. అయితే ఛేజింగ్‌లో భారత్ 55 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులతో, జెమిమా రోడ్రిగ్స్ 29 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. దీప్తి 48 బంతుల్లో 39 పరుగులు చేయగా, రిచా ఘోష్ 11 బంతుల్లో 23 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ చిన్న లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలోనే ఛేదించింది. దీప్తి మొదట బంతితో ఆ తరువాత బ్యాట్‌తో నూ మెరిసింది. దీంతో ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.