Helicopter Crash : ఆస్పత్రి బిల్డింగ్‌ను ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి! వీడియో
ఆదివారం ఉదయం తుర్కిష్ లో ఘోర ప్రమాదం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్న ఓ హెలికాఫ్టర్ దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పక్కనే ఉన్న ఆస్పత్రి బిల్డింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లైలట్లు, ఓ వైద్యుడు, మరో వైద్య సహాయకుడు అక్కడికక్కడే మృతి చెందారు.. తుర్కిష్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులతో బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్కనే ఉన్న ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం నలుగురు మృతి చెందారు. ముగ్లా ప్రావిన్షియల్ గవర్నర్ ఇద్రిస్ అక్బియిక్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కియేలోని అంతల్యా ప్రావిన్సులో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు హెలికాప్టర్‌లో బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, ఓ వైద్యుడు, మరో వైద్య సహాయకుడు ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడ విపరీతమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న క్రమంలో పక్కనే ఉన్న ఆసుపత్రి భవనం నాలుగో అంతస్తును ఢీకొట్టింది. అదీంతో హెలికాఫ్టర్ నేలకూలింది. ఈ ఘటనలో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అక్బియిక్ చెప్పారు. ప్రమాద కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో హెలికాఫ్టర్ టేకాప్ అవడం, అది ఆసుపత్రి భవనం ఢీకొట్టడం, అనంతరం ఆస్పత్రి ముందు హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోల్లో కనిపిస్తుంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827