Google India: గూగుల్ కొత్త క్యాంపస్ అనంత ప్రారంభం.. ప్రపంచంలోనే..

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ బుధవారం బెంగళూరులో తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద కార్యాలయాలలో ఒకటి కావడం విశేషం. టెక్ దిగ్గజం గూగుల్(Google India), భారతదేశంలో తన అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాంపస్ ‘అనంత(Ananta)’ని ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యంత పెద్ద కార్యాలయాలలో ఒకటి కావడం విశేషం. ఈ కొత్త కార్యాలయం బెంగళూరులో ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో టెక్నాలజీ, స్టార్టప్, ఆవిష్కరణల రంగంలో గూగుల్ మరింత విస్తరించనుంది. గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ క్యాంపస్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈరోజు గూగుల్ ప్రపంచంలో అత్యంత పెద్ద కార్యాలయాల్లో ఒకటైన ‘అనంత’ ప్రారంభించిందని, భారతదేశం పట్ల మా నిరంతర నిబద్ధతను మేము పంచుకుంటున్నామని సంస్థ వెల్లడించింది. "అనంతం" అంటే "అపరిమితం" అని అర్థం. ఇది గూగుల్ టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతటా అపరిమిత అవకాశాలను సూచిస్తుంది. గూగుల్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు నగరంలో ఈ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇది గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రౌండ్ అప్ డెవలప్‌మెంట్‌లో ఒక భాగమని చెబుతున్నారు. ‘అనంత’ క్యాంపస్ వర్క్‌ప్లేస్ డిజైన్‌లో గూగుల్ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఈ క్యాంపస్‌లో ప్రతి వర్కింగ్ ఫ్లోర్ సిటీ గ్రిడ్ లాంటి విధానంలో రూపొందించారు. దాని సమీపంలో వీధుల నెట్‌వర్క్ కూడా ఉంది. దీంతో నావిగేషన్ సులభంగా ఉంటుంది. ఈ విధానం వల్ల కార్యాలయంలో వ్యక్తులు ఒకరికొకరు సహకరించుకోవడంతో కీలక పాత్ర పోషిస్తుంది.