Gold Price Today: వార్నీ.. మరోసారి షాకిచ్చిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ఎంత పెరిగిందంటే?

Gold Price Today: గతవారం రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గుతూ వచ్చిన ధరలు, గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా వినియోగదారులకు బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. Gold Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరోసారి పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 770 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 710 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,080 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,660గా ఉంది. అలాగే, వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో ఏకంగా రూ. లక్ష దాటింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..