Gold and Silver Prices Today: నేడు స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. కొనాలంటే ఇదే శుభ తరుణం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం మీద ఉన్న మోజు కారణంగానే ప్రతి సంవత్సరం టన్నులకు టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతి అవుతుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న గిరాకీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోని ధరల ప్రభావం వలన కూడా పసిడి , వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ఇదే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరులలో కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర మంగళవారం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 71,140గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,590లుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 70, 990 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77, 440 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరలు బెంగళూరు, కేరళ, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. మన దేశంలో బంగారం తర్వాత అంత ఆదరణ పొందిన లోహం వెండి. పెళ్ళిళ్ళు, పంక్షన్లు వస్తే చాలు వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇప్పుడు వెండితో చేసిన ఆభరణాలు కూడా ఒక ట్రెండీగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కిలో వెండి ధర ఒకానొక సమయంలో లక్ష దాటింది కూడా.. ఈ నేపధ్యంలో నేటి వెండి ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం.. దేశ వ్యాప్తంగా పసిడి ధర స్థిరంగా ఉంటె.. వెండి ధర మాత్రం ఈ రోజు ( మంగళవారం) స్వల్పంగా దిగి వచ్చింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 మేర తగ్గి రూ. 91,300వద్ద కొనసాగుతోంది. భారతీయులు పండగలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి స్పెషల్ డేస్ లో మాత్రమే కాదు ఎప్పుడు డబ్బులు అందుబాటులో ఉంటే అప్పుడు.. ఏడాది పొడవునా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తినిమ చూపిస్తూ ఉంటారు. భారతీయులు బంగారం నగలను ఓ స్టేటస్ సింబల్ గా చూస్తారు. అంతేకాదు ఎప్పుడైనా అనుకోని విధంగా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడితే ఆపద సమయంలో ఆదుకుంటుంది అని కూడా భావిస్తారు. ఇక కరోనా తర్వాత నుంచి ముదుపరులు బంగారాన్ని ఓ పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో ఒకానొక సమయంలో ఆల్ టైం హైకి చేరుకుంది పసిడి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం డాలర్ బలపడడంతో బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు (డిసెంబర్ 24వ) మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. దేశంలో బంగారం ధర స్వల్పంగా దిగి స్తుంది. అయితే మంగళవారం రోజున పసిడి ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం మాదిరిగానే నేడు (డిసెంబర్ 24వ తేదీ) మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 70,990 వద్ద ఉంది. ఇదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,440గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో సోమావారం వలెనే పసిడి ధర మంగళ వారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70.990 ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 77,440లుగా కొనసాగుతోంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827