Delhi Schools Bomb Threat: ఢిల్లీలోని 40 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన పోలీసులు
దేశరాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈరోజు ఉదయం ర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లోని డీపీఎస్ ఆర్‌కె పురం, జిడి గోయెంకా పాఠశాల అనే రెండు పాఠశాలలకు సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్‌కు బాంబ్ స్క్వాడ్, పోలీసులు చేరుకున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్ స్కూళ్ళలో తనిఖీలు చేపట్టింది. డీపీఎస్ ఆర్‌కె పురం నుండి ఉదయం 7.06 గంటలకు, జిడి గోయెంకా పశ్చిమ్ విహార్ నుండి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఓ డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు . అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. నవంబర్ 29న రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులు సంబంధిత అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)తో సహా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నవంబర్ 19న ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాలను పూర్తి చేసేందుకు కోర్టు ఎనిమిది వారాల గడువు విధించింది. దేశ రాజధానిలోని 40కి పైగా పాఠశాలలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో పాఠశాల యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టి విద్యార్థులను ఇంటికి పంపించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో, లక్నోలోని మూడు కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపు బూటకమని తేలింది. గుర్తుతెలియని కాలర్ శనివారం రాత్రి UP పోలీసుల ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అయిన 112కి డయల్ చేసి, హుస్సేన్‌గంజ్ మెట్రో స్టేషన్, చార్‌బాగ్ రైల్వే స్టేషన్, అలంబాగ్ బస్టాండ్‌లో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నాడు. కాల్ వచ్చిన తర్వాత మూడు స్థానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ)-సెంట్రల్ మనీష్ సింగ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ప్రముఖ తాజ్ మహల్ సహా పలుచోట్ల బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827