CM Revanth Reddy: వనపర్తి పర్యటనలో నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్..!

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. సీఎం సొంత జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే జిల్లాలో పర్యటిస్తుండగా, సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా ఓ ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆ ఇంటికి ఎందుకు వెళ్లారనేది చర్చ జరుగుతోంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో పలు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన తో పాటు ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలులు పాల్గొన్నారు. ఐతే వొస్తూ రాగానే ఒకరి ఇంటికి వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ఇంట్లో కి రాగానే ఆప్యాయంగా పలకరించి ఒక పెద్దావిడ. అయితే ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు సిఎం నేరుగా వొచ్చారు అని పెద్ద చర్చే వచ్చింది. అసలు విషయం తెలుసుకున్నాక అందురు సంతొషం వ్యక్తం చేశారు. ఆ మె పేరు పార్వతమ్మ…! వీళ్ళింట్లోనే ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దెకు ఉండేవారు. ఆ కుటుంబంతో రేవంత్ కు ఎంతో అనుబంధం ఉంది. హారతి పట్టి ప్రేమతో రేవంత్ ను సాదరంగా ఆహ్వానించారు. ఎన్నాళ్ళయింది చూసి అంటూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.