Champions Trophy: భారత్‌పై నోరు జారితే తాటతీస్తాం.. హైబ్రిడ్ మోడల్‌కే సిద్ధం కండి: పీసీబీకి ఐసీసీ వార్నింగ్

ICC Champions Trophy 2025: భారత జట్టు 2008 నుంచి పాకిస్థాన్‌కు వెళ్లలేదు. గత 12 ఏళ్లుగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడలేదు. ఇప్పుడు ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. అయితే, పాకిస్థాన్‌లో టోర్నీ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఒకవైపు పాకిస్థాన్‌లో టోర్నీ ఆడేందుకు భారత్ నిరాకరించగా, మరోవైపు హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించేందుకు పాకిస్థాన్ ససేమీరా అంటోంది. ఈ రెండు క్రికెట్ బోర్డుల నిర్ణయం ఇప్పుడు ఐసీసీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఈ టోర్నీని పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు అనుమతిస్తామని చెప్పిన ఐసీసీ.. భారత్‌కు హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించాలని పేర్కొంది. ANI నివేదిక ప్రకారం, ICC అధికారులు తదుపరి హైబ్రిడ్ మోడల్‌లో టోర్నమెంట్‌ను నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ లేకుండా టోర్నీ నిర్వహించడం వల్ల కలిగే నష్టాన్ని, పరిణామాలను కూడా పీసీబీ అధికారులు వివరించినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ప్రస్తుతం ఉన్న ఏకైక ఎంపిక హైబ్రిడ్ మోడల్ అని ఐసీసీ తెలిపింది. PCB స్టేట్‌మెంట్‌లకు విరామం.. ఛాంపియన్స్ ట్రోఫీపై తమ స్టాండ్ గురించి బీసీసీఐ ఐసీసీకి తెలియజేసింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సహా కొందరు అధికారులు మాత్రం బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి భారత్‌పై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.