Cancer Patients: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. 3 నెలల్లో వ్యాధిని నయం చేస్తోన్న వ్యాక్సిన్‌..!

ప్రస్తుతం మానవాళిని భయపెడుతోన్న వ్యాధి క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అంతేకాదు తీవ్రంగా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. రోజు రోజుకీ క్యాన్సర్ బాధితులు పెరుగుతుండమే కాదు.. మరనిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో క్యాన్సర్‌ను నయం చేసే ఇంజెక్షన్ ను తయారు చేసినట్లు.. అది ప్రభావంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024 అక్టోబర్‌లో ఐదుగురు క్యాన్సర్ రోగులకు CAR-T థెరపీ ఇంజెక్ట్ చేసినట్లు చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెప్పారు. క్యాన్సర్‌ను నయం చేసే CAR-T ఇంజెక్షన్ గురించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2024 నవంబర్లో ఐదుగురు క్యాన్సర్ బాధితులకు CAR-T ఇంజెక్షన్‌ చేసినట్లు.. ఈ చికిత్స పొందిన ఈ రోగులందరూ క్రమంగా కోలుకుంటున్నారని హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న ఆ బాధితులకు సంబంధించిన ప్రతిచర్యలను వెల్లడించారు. అంతేకాదు ఈ పేషెంట్స్ కోలుకున్న విధానం చూసిన తర్వాత, ఈ CAR-T ఇంజెక్షన్ కోసం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ ఇంజెక్షన్ అక్టోబర్ 2024లో చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో ఐదుగురు క్యాన్సర్ పేషెంట్స్ కు ఇవ్వబడింది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన రోగులలో ఒకరికి 73 సంవత్సరాలు, మరొకరికి 71 సంవత్సరాలు, మూడవ వ్యక్తికి 67 సంవత్సరాలు, నాల్గవ వ్యక్తికి 15 సంవత్సరాలు.. ఐదవ వ్యక్తికి 5 సంవత్సరాలు. ఫిబ్రవరి నాటికి ఈ రోగులు క్యాన్సర్ నుంచి చాలా ఉపశమనం పొందారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోగులు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నారు. శాస్త్రవేత్తలు ఈ రోగులు చెప్పిన అనేక విషయాలను కూడా నమోదు చేశారు. అందులో రోగులు తమ అనుభవాలను వివరించారు. క్యాన్సర్ రోగి లీ చుంగ్ ప్రకారం ఈ ప్రక్రియకు కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది. తరువాత నెమ్మదిగా తనకు రిలాక్స్ అయినట్లు అనిపించడం మొదలైంది. ఇప్పుడు నొప్పి లేదని.. వ్యాధి వేగంగా తగ్గుతున్నట్లు.. తన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. దీంతో CAR-T ఇంజెక్షన్ క్యాన్సర్ రోగులకు ఒక వరంలా మారుతుందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. CAR-T ఇంజెక్షన్ల ధర నివేదిక ప్రకారం ఈ టీకా ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులో లేదు. హాంకాంగ్ ఆధారంగా ఈ CAR-T ఇంజెక్షన్ ఖర్చు కేవలం రూ.3 కోట్లు మాత్రమే. అయితే ఇతర దేశాల్లో ఈ ఇంజెక్షన్ ధర మరింత పెరగవచ్చు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రోగిని 7 రోజులు ఐసియులో ఉంచాలి. అయితే దుష్ప్రభావాలకు విడిగా చికిత్స చేయాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఈ ఇంజెక్షన్ ఇప్పటివరకు కాలేయం లేదా ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్‌కు మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తుందని నిరూపించబడింది. భారతదేశంలో ఈ చికిత్స ఏ స్టేజ్ లో ఉందంటే ఈ చికిత్స భారతదేశంలో 2023లో ఐఐటీ బాంబే నుంచి ప్రారంభించబడింది. భారతదేశంలో నెక్స్‌కార్-19 ద్వారా రోగులకు CAR-T చికిత్సతో చికిత్స అందిస్తున్నారు. ఇది భారతదేశంలో తయారు చేయబడిన చికిత్స. మేడ్ ఇన్ ఇండియా ద్వారా రోగులకు తక్కువ ధరకు వ్యాక్సిన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేచర్ మ్యాగజైన్ ప్రకారం భారతదేశంలో అందిస్తున్న ఈ చికిత్స రక్త క్యాన్సర్ చికిత్సలో మంచి సహాయకరంగా ఉంటుందని నిరూపించబడిందని తెలుస్తోంది.