Bigg Boss 8 Telugu: యష్మీ, ప్రేరణలకు షాకిచ్చిన ఆదిత్య.. గ్రూప్ గేమ్ పై కౌంటర్స్..

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా మాజీ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోనియా, బేబక్క, శేఖర్ బాషా ఇంట్లో చిచ్చు పెట్టారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సీత, నైనిక, మణికంఠ, ఆదిత్య ఎంట్రీ ఇచ్చారు. మాజీ కంటెస్టెంట్లతో నామినేషన్స్.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‏లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే సోనియా, శేఖర్ బాషా, బేబక్క హౌస్మేట్స్ ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ప్రేరణ, యష్మీలకు చుక్కలు చూపించాడు. ఒక్కో పాయింట్ లాగుతూ యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ గ్రూప్ గేమ్ పై కౌంటర్స్ ఇచ్చాడు. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ డైలాగ్స్ కొడుతూ హౌస్ లోకి అడుగుపెట్టాడు ఆదిత్య. విష్ణు వెళ్లి ఆదిత్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోగా.. నన్ను ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ కౌంటరిచ్చాడు. తన ఫస్ట్ నామినేషన్ యష్మీ అని చెప్పడంతో నాకు తెలుసు అంటూనే నిలబడింది.