Bangladesh: ఇస్కాన్‌కు జమాతే ఇస్లామీ బెదిరింపు.. 24 గం. ఆలయాన్ని మూసివేయాలని అల్టిమేటం జారీ

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం మారినప్పటి నుంచి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత.. ఇప్పుడు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కార్యకర్తలు ఇస్కాన్ ఆలయాన్ని 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయుల త్యాగాలతో ఆర్ధిక సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ కు ఇప్పుడు ఆ దేశంలో హిందువులు, హిందూ ఆలయాలు నచ్చడం లేదు.. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంలో హిందులపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీల గొంతుగా మారిన ఇస్కాన్ అధినేత చిన్మోయ్ కృష్ణ దాస్ ను మహమ్మద్ యూనస్‌ సర్కార్ అరెస్ట్ చేసింది. కనీసం బెయిల్ రాకుండా చేయడమే కాదు.. కృష్ణ దాస్ తరపున కేసు వాదిస్తున్న లాయర్ కూడా హత్య గావింప బడ్డాడు. చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై బంగ్లాదేశ్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం విధించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు జమాత్ కార్యకర్తలు ఇస్కాన్‌పై బెదిరింపులకు దిగుతున్నారు. బంగ్లాదేశ్‌లోని సోనాలి మార్కెట్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయాన్ని 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం జారీ చేశారు. జమాత్ కార్యకర్తలు ఇస్కాన్ ను బెదిరించడం కాదు.. ఇస్కాన్ ఆలయం పెరుతున్న బోర్డు కూడా తీసి తమ సంస్థ పేరు ఉన్నబోర్డుని పెట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు సంబంధించిన వివాదం ఏమిటి? బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువులపై హింస పెరిగింది. హిందువుల హక్కుల కోసం ఇస్కాన్‌ నేత చిన్మోయ్‌ కృష్ణ దాస్‌ తన గళాన్ని వినిపిస్తున్నారు. అక్టోబరు చివరి వారంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలున్నాయి.