Andhra Pradesh: మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నోటిఫికేసన్.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో అమలవుతోన్న మద్యం చట్టాలపై కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మద్యం విక్రయాల్లో జరుగుతోన్న అవకతవకాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాల్లో అవకతవకలను నియంత్రించేందుకు ఈ నోటిఫికేషన్ లో కఠిన చర్యలను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మద్యం దుకాణాలు మరియు బార్ లైసెన్సులకు కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడం పూర్తిగా నిషేధించబడ్డట్టు ప్రకటించిన ప్రభుత్వం మొదటిసారి ఇలా చేస్తే రూ. 5 లక్షల భారీ జరిమానా విధించబడుతుందనీ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అదే తప్పు మళ్లీ చేస్తే దుకాణం లేదా బార్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపుల నిర్వహణ కూడా పూర్తిగా నిషేధించబడింది. బెల్ట్ షాపులను నిర్వహిస్తే మొదటిసారి జరిమానా విధించగా, రెండోసారి మాత్రం ఆ దుకాణం లైసెన్సు రద్దు చేస్తారు. ఈ నిబంధనలు మద్యం దుకాణాలకే కాకుండా బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) కింద తీసుకోబడుతున్నాయి. ప్రజలకు న్యాయమైన ధరల వద్ద మద్యం అందుబాటు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేయడం ద్వారా మద్యం విక్రయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. మద్యం వ్యాపారులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా తమ లైసెన్సులను రక్షించుకోవాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించేవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న అంశాలివే.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మొదటి సారి చేసిన తప్పుకు ₹5 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక బెల్ట్ షాపుల నిర్వహణ విషయానికొస్తే.. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ₹5 లక్షల జరిమానా, అదే తప్పు మరోసారి చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ నిబంధనలు బార్ లైసెన్సులకూ కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం విక్రయం నియంత్రణ, అక్రమాలు, బెల్ట్ షాపుల మీద నిఘా ప్రజలకు న్యాయమైన ధరలకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడం. నిబంధనలను పాటించడం ద్వారా వ్యాపారులు తమ లైసెన్సులను కాపాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827