Andhra Pradesh: ‘టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా’.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. కబ్జాలకు కళ్లెం వేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం తెలిపింది. సీఎన్‌జీపై వ్యాట్ 5 శాతానికి తగ్గింపు... విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్‌లకు ఆమోదం సహా కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.నేరాలను నియంత్రించేలా పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్.అలాగే లోకాయుక్త చట్ట సవరణ బిల్లు సహా దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకగంజాయి, డ్రగ్స్ మత్తు దందా బెండు తీస్తామని ఏపీ సర్కార్ ఇప్పటికీ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ దిశగా యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ను పేరు ఈగల్ గా మారుస్తూ ఎలైట్ యాంటీ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణ, ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్‌గ్రిడ్‌లో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజధాని అమరావతికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణకు పనుల కోసం కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే అంశంపై కేబినెట్ చర్చించింది. ఏపీ టూరిజం పాలసీ సహా స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. సీఎన్‌జీపై వ్యాట్ 5 శాతానికి తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 సహా విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్‌లకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రధాన మత్రి ఆవాస్ యోజన కోసం గృహ నిర్మాణ వాఖ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది కేబినెట్.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827