Allu Arjun: ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడే దారుందా..

ఊరుకున్న ఉత్తమం లేదు..అనిఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా...అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు.. కానీ రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్‌ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో.. ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పుష్ప సూపర్‌హిట్‌. పుష్ప టూ సూపర్‌డూపర్‌ హిట్‌. పుష్ప త్రీ కూడా ఉంటుందని ఆ సిన్మా టీం హింట్‌ ఇచ్చిందిగానీ.. రీల్‌ లైఫ్‌ని మించిన స్టోరీ రియల్‌ లైఫ్‌లో గిర్రున తిరిగిపోతోంది. పుష్ప2 బాక్సాఫీస్‌ రికార్డుల్ని బద్దలుకొడితే.. ఈ పుష్ప త్రీ ఎపిసోడ్‌ కంట్రీవైడ్‌ కుదిపేస్తుండటం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఊరుకున్న ఉత్తమం లేదు.. అనిఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా…అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు.. కానీ రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్‌ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో.. ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పైగా మధ్యంతరబెయిల్‌ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటితో ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడంలేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్‌రాజు తెరపైకి వచ్చారు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎం ను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో..మున్ముందు ఎలాంటి టర్న్‌లు తీసుకోబోతున్నాయి..? ఈకేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..? అంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.. ఎక్కేమెట్టు.. దిగేమెట్టు.. అన్నట్టుగా ఉంది పుష్ప ది సంధ్య ధియేటర్ ఎపిసోడ్. రీల్‌ సూపర్‌హిట్టే.. కానీ రియలే బంపర్ ప్లాపన్న చందాన నడుస్తోంది ప్రజెంట్ సిట్చువేషన్. రిమాండ్ రిపోర్ట్ చూసినా.. పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూవ్‌మెంట్‌ గమనించినా…ప్రభుత్వం సీరియస్‌నెస్ విశ్లేషించినా…కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్ధమవుతోంది. దీనికి ఎండ్ బజర్‌ ఇప్పట్లో ఉండదన్నది అర్థమవుతోంది. సో..నోడౌట్.. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు..అన్నది అనుభవజ్ఞులమాట. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తనపని తాను చేసుకుపోతోంది. ఇటు బన్నీ కుడా చట్టానికి సహకరిస్తూ..విచారణకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్‌కు అందాయ. మంగళవారం 11గంటలకల్లా విచారణకు హాజరుకావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మార్నింగ్ పదన్నర ప్రాంతంలో కు జూబ్లీహిల్స్‌లోని తననివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్. పోలీస్ స్టేషన్‌కు అల్లుఅర్జున్ వెళ్తుండటంతో, ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే ముందు ఆయన భార్య, కూతురు కారు వద్దకు రాగా, వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. బన్నీతోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ, వ్యక్తిగత సిబ్బందితో నాలుగు కార్ల కాన్వాయ్‌లో బయలుదేరారు. షార్ప్ పదకొండు 15నిమిషాలకల్లా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బన్నీ అండ్ టీమ్ దిగింది. విచారణ సమయంలో బన్నీ ఆయన తరపు లాయర్ అశోక్‌ మినహా మిగతా ఎవర్నీ అలౌవ్ చేయలేదు. 11.30-11.40 మధ్య టైములో విచారణ ప్రారంభమైంది. దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిగింది. అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా.. మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. మూడున్నర గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు. కొన్నింటికి సమాధానాలు..మరికొన్నింటికి మౌనమే సమాధానం. టోటల్‌గా రెండు మూడు ప్రశ్నలకు మినహా..పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లు మాచారం.