Allu Arjun: చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్..

సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడా జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న అరెస్ట్ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా..14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు అభిమానులు. ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న అల్లు అర్జున్‏ను ఈరోజు ఉదయం విడుదల చేశారు పోలీసులు. హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సి ఉండగా.. ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో ఈరోజు విడుదల అయ్యారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా చేర్చారు. అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తనపై నమోదైన కేసులపై క్వాష్ పిటీషన్ ను వేయగా.. హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. నిన్న మధ్యాహ్నమే మధ్యంతర బెయిల్ కోరుతూ బన్నీ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించగా.. బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. వ్యక్తిగత పూచికతతో బెయిల్ మంజూరు చేయడంతో.. జైలు సూపర్ డెంట్ కు షూరిటీ లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నిన్న రాత్రి అల్లు అర్జున్‌ న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండ్‌కు సమర్పించారు. కానీ అప్పటికే ప్రొసీజర్ ఆలస్యం కావడంతో బన్నీ విడుదల ఆలస్యమైంది.