Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్.. గాంధీ ఆసుపత్రిలో బన్నీకి వైద్యపరీక్షలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అల్లుఅర్జున్‌కు ముగిసిన వైద్య పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో అల్లుఅర్జున్‌కు ముగిసిన వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్డుకు అల్లు అర్జున్‌ తరలింపు. అల్లు అర్జున్ అరెస్ట్ దుర్మార్గమైన చర్య, అగౌరవకరం: బండి సంజయ్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్ రూం నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య, అగౌరవకరం.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం, అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతోందని బండి సంజయ్ అన్నారు.