Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియోపై రేవంత్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు. దీని పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ కు ఆయన అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చాలా మంది సెలబ్రెటీలు అవగాహనా వీడియోలను చేస్తున్న విషయం తెలిసిందే.. యాంటీ నార్కోటిక్‌ టీమ్‌ కోసం ఇప్పటికే సినిమా హీరోలు పలు వీడియోలు చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు. దీని పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ కు ఆయన అభినందనలు తెలిపారు. “డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్‌ వీడియో చేయడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అని సీఎం తెలిపారు. ఈ కామెంట్స్ కు పలు యాష్ ట్యాగ్స్ కూడా జోడించారు. కాగా రేవంత్ రెడ్డి పోస్ట్ కు అల్లు అర్జున్ రిప్లే ఇచ్చారు. డ్రగ్స్ నిర్ములనపై అవగాహనా కల్పిస్తూ బన్నీ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు.. హైదరాబాద్‌ ను, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు వెంటనే ఫోన్‌ చేయండి. వారు స్పందించింది బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం” అని అల్లు అర్జున్ వీడియో ద్వారా తెలిపారు.