మోటివేషన్ స్పీకర్ అంటూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న AI ట్రైనర్ సలవాడి వెంకటేష్

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి చెందిన సలవడి వెంకటేష్ గత కొద్ది కాలంగా మోటివేషన్ స్పీకర్, ఏఐ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ, తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లాసులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆన్లైన్ ద్వారా ఏఐ క్లాసులు,మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున యువతని, ఉద్యోగులను ఆకర్షిస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ఉంటాడు. తిరుపతికి చెందిన ఒక మహిళ యూట్యూబ్ లో అతని వీడియోలు చూసి ఆన్లైన్ ద్వారా ఏఐ టూల్ కి సంబంధించి కోర్స్ జాయిన్ అయింది.. ఆమె కి డౌట్స్ క్లియర్ చేస్తూ ఆమెని మంచిగా చనువు చేసుకొని తన వశం పరుచుకొని, సెక్సువల్ హరాస్మెంట్ చేయడం ప్రారంభించాడు, ఆమెకి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ నీ భర్తనీ పిల్లల్ని వదిలేసి నా దగ్గరికి రావాలంటూ ఆమెను వేధిస్తూ బ్లాక్మెయిల్ చేయడం గత కొద్దిరోజులుగా జరుగుతూ ఉంది. ఆ మహిళ తన పరువు ఎక్కడ పోతుందని బయటపడకుండా కనీసం తన భర్తకి కూడా చెప్పకుండా అతని బెదిరింపులకి భయపడి, తన భర్తకి చెప్పకుండా తనలో తను మదన పడుతూ ఉన్నది. తన భర్త కి అనుమానం వచ్చి మొబైల్ ఫోన్,మెసెంజర్ చెక్ చేయగా సలవాడి వెంకటేష్ యొక్క బాగోతం బయటపడింది, ఈ విషయమై ఆమె భర్త తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు దృష్టికి తీసుకెళ్లగా అలిపిరి సీఐ రామకిషోర్ కి రిఫరెన్స్ చేశారు.సిఐ రామకిషోర్ ఈ విషయమై స్పందిస్తూ ముఖ్యంగా స్త్రీలు, స్టూడెంట్స్ ఇలాంటివారినా బారిన పడకుండా ఉండాలని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, ఇలాంటి వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.