Adani Case: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన కేసు.. అదానీ వ్యవహారంపై స్పందించిన భారత ప్రభుత్వం

విద్యుత్‌ కాంట్రాక్టుల కోసం ముడుపులు ఇచ్చారంటూ అదానీ గ్రూప్‌ మీద అమెరికా న్యాయవిభాగం చేసిన ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదానీ కేసుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. విద్యుత్‌ కాంట్రాక్టుల కోసం ముడుపులు ఇచ్చారంటూ అదానీ గ్రూప్‌ మీద అమెరికా న్యాయవిభాగం చేసిన ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఇప్పటికే తోసిపుచ్చింది.. అయితే.. అదానీ పై కేసు వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.. ఈ విషయంపై పార్లమెంట్లో కూడా గళమెత్తాయి. ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదానీ కేసుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఇది ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన కేసు.. అంటూ పేర్కొంది.. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో.. అదానీ కేసుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన సంబంధాలు లేవని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన లంచం ఆరోపణలపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. అభియోగాల నమోదు గురించి అమెరికా వారికి ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పింది. అమెరికా నుంచి తమకు ఎలాంటి సమన్లు, వారెంట్లు అందలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ఈ కేసు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులతో పాటు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించిన చట్టపరమైన వివాదం అని తెలిపారు.