47వ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం - 'మేము ఒక కారణం కోసం చరిత్ర సృష్టించాము'

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలిందల్లా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో మొత్తం 538 సభ్యులు ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అందులో 270 మంది మద్దతు అవసరం. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో 267 మంది విజయం సాధించారు. మరోవైపు కమలా హారీస్‌కు ఓటు వేయాల్సిన డెమొక్రాట్స్ 224 స్థానాల్లోనే గెలుపొందారు. డోనల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్న మెజారిటీకి ఆమె దరిదాపుల్లో కూడా లేరు. దీంతో ఇక ట్రంప్ విజయం సాధించినట్లేనని అమెరికన్స్ ఒక నిర్ణయానికొచ్చేశారు. డోనల్డ్ ట్రంప్ సైతం తనని తాను అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో తన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు 45 అధ్యక్షుడిని తానే.. అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనని అన్నారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం డోనల్డ్ ట్రంప్ విజయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇక మిగిలిందల్లా ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ మాత్రమే. ఇదిలావుంటే డోనల్డ్ ట్రంప్ ను అభినందిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా "హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.