Bank Holiday: నవంబర్‌ 15న బ్యాంకులు బంద్‌.. కారణం ఏంటో తెలుసా..?

Bank Holiday: సాధారణంగా ప్రతి నెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). పండగలు, ఇతర కార్యక్రమాలు, ప్రముఖుల జయంతిలకు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈనెల 15న కూడా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మూసి ఉంటాయని తెలుస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు జాబితా ప్రకారం, గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా శుక్రవారం అంటే నవంబర్ 15, 2024న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆర్బీఐ తన వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా ప్రాంతీయ, జాతీయ సెలవులను ప్రచురిస్తుంది. నెలలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయని గుర్తుంచుకోండి. గురునానక్ గురుపురబ్, గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఇది మొదటి సిక్కు గురువు గురునానక్ పుట్టిన జ్ఞాపకార్థం. గురునానక్, సిక్కుమతం స్థాపకుడు. అత్యంత గుర్తింపు పొందిన, ప్రముఖ సిక్కు గురువులలో ఒకరైన గురునానక్‌ను సిక్కు సమాజం గొప్పగా గౌరవిస్తుంది. ఈ వేడుక గురునానక్ బోధనల గురించి అవగాహనను పెంచుతుంది. అలాగే కార్తిక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతిని అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుపుకుంటారు. ఎందుకంటే చంద్ర క్యాలెండర్లు ప్రతి సంవత్సరం మారుతాయి.

My post content