ఏకకాలంలో విజృంభిస్తోన్న రెండు ప్రాణాంతక వ్యాధులు.. కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరిక

గత కొన్ని వారాలుగా ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. ఇంతలో నేను ఉన్నా అంటూ X వ్యాధి కేసులు కూడా ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా 140 మందికి పైగా మరణించారు. ఏకకాలంలో రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO ప్రపంచాన్ని అలెర్ట్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మరణించారు. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ కూడా 100కి పైగా దేశాల్లో వ్యాపించింది. కొన్ని కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం మార్బర్గ్ వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇంతలో.. డిసీజ్ X అనే కొత్త వ్యాధి మానవాళికి ముప్పుగా మారింది. ఆఫ్రికాలో 300 కంటే ఎక్కువ X కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బాడిన పడి 140 మందికి మరణించారు. రెండు ప్రాణాంతక వ్యాధుల కేసులు ఏకకాలంలో పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో.. WHO ప్రజలను అప్రమత్తం చేసింది. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్ కేసుల ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా.. కొత్త అంటువ్యాధి వచ్చే అవకాశం కూడా పెరుగుతోంది. WHO 2018 సంవత్సరంలో డిసీజ్ X గురించి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అయితే ఈ వ్యాధి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుందా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటికే ఆఫ్రికాలో హీంబర్గ్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటువంటి పరిస్థితిలో వ్యాధి X కేసుల కారణంగా..రెండు వ్యాధులు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయి.